
తాజా వార్తలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుందని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తన మనసులోని మాటను జగ్గారెడ్డి బయటపెట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైదొలిగిన రోజు ఆ పదవిని తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
ఈనెల 16న దిల్లీలో ఏఐసీసీ ముఖ్య సమావేశం ఉండటంతో తన బయోడేటాను పార్టీ పెద్దలకు పంపినట్లు జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురికి బయోడేటా పంపినట్లు ఆయన వివరించారు. ఈ అంశంపై త్వరలోనే పార్టీ పెద్దలను తాను కలుస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి తన వద్ద అద్భుతమైన మందు ఉందని.. అవసరమైనప్పుడు దానిని బయటకు తీసుకొస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
