
తాజా వార్తలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా నేతల బృందం కలిసింది. మాజీ మంత్రి అఖిల ప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం అఖిల ప్రియ, తెదేపా నేతలు విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి తనను, తన భర్తను వేధిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు అఖిలప్రియ తెలిపారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారని ఆమె అన్నారు.
ఇది పోలీసులు మీద వ్యక్తిగతంగా చేసిన ఫిర్యాదు కాదని, తమపై తప్పుడు కేసులు పెట్టడానికి గల కారణాలు ప్రజలకు తెలియాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. కేవలం ఆళ్లగడ్డలోనే తెదేపా సానుభూతిపరులపై 40కి పైగా తప్పుడు కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. అఖిల ప్రియ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు బనాయించడం మంచి పద్ధతికాదని తెదేపా నేతలు విమర్శించారు. గవర్నర్ వద్దకు వెళ్లిన వారిలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మద్దాలగిరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు ఉన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
