
తాజా వార్తలు
దిల్లీ: మరాఠా రాజకీయాలు క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం కోసం శివసేన గడువు కోరగా.. ఇందుకు గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై అసంతృప్తి చెందిన సేన.. సుప్రీంకోర్టు తలుపుతట్టేందుకు సిద్ధమవుతోంది.
ప్రభుత్వ ఏర్పాటుపై వైఖరి తెలియజేసేందుకు భాజపాకు మూడు రోజుల గడువు కల్పించిన గవర్నర్.. తమకు మాత్రం 24 గంటలు మాత్రమే ఇచ్చారని శివసేన తెలిపింది. మద్దతు కూడగట్టుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినా.. ఆయన ఒప్పుకోకపోవడంతో శివసేన పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కోర్టులో తమ తరఫున వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను శివసేన సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై కపిల్ సిబల్ గానీ.. అటు శివసేన గానీ అధికారికంగా స్పందించలేదు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టడానికి మూడు రోజుల గడువు కావాలని శివసేన.. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని అభ్యర్థించగా ఇందుకు ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత కాసేపటికే మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీకి రాజ్‌భవన్ నుంచి పిలుపు వచ్చింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- నిందితులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు:సజ్జనార్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
