
తాజా వార్తలు
గుంటూరు: మాతృభాషలో బోధన మంచిదన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచనపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో వెంకయ్యనాయుడు పాత్ర ఎంతో ఉందని.. అలాంటి వ్యక్తి ఒక సూచన చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడటం తగదన్నారు. వెంటనే వెంకయ్యనాయుడుకు జగన్ క్షమాపణలు చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన విషయం గుర్తించాలన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.
నోబెల్ బహుమతులు పొందిన వారు కూడా మాతృభాషలోనే చదువుకున్నారని కన్నా గుర్తు చేశారు. నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షనేతగా ఉన్న సమయంలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న జగన్.. ఇప్పుడు అదే పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంకా ఇసుక కొరత తీరలేదని.. ఈలోపే సిమెంటు ధరలు కూడా పెరిగాయని కన్నా వ్యాఖ్యానించారు. దీని వెనుక రహస్య అజెండా ఏమిటో సీఎం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మద్యం పాలసీని వెంటనే అమలు చేసినా.. ఇసుక పాలసీని మాత్రం ఎందుకు అమలు చేయకుండా నెలల తరబడి ఆపారో చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
