
తాజా వార్తలు
శివసేన ఎంపీ అరవింద్ సావంత్
దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ సోమవారం ఉదయం శివసేన ఎంపీ అరవింద్ సావంత్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుంకుంది. దీంతో మహారాష్ట్రలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. తాజాగా ఆయన తన రాజీనామాపై మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశానని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపానని వెల్లడించారు. ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఎన్డీయే నుంచి బయటికి వచ్చినట్లేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘రాజీనామా చేశానంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి’ అంటూ పరోక్షంగా కూటమి నుంచి వైదొలిగినట్లేనన్న సంకేతాలు ఇచ్చారు. పొత్తులో భాగంగా ఎన్నికలకు ముందు చెరిసగం కాలం పాలనకు భాజపా అంగీకరించిందని తెలిపారు. కానీ, ఫలితాల అనంతరం మాట మార్చిందన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవిలో ఇంకా కొనసాగడం సరైనది కాదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతివ్వాలంటే శివసేన ఎన్డీయే నుంచి బయటకు రావాలని ఎన్సీపీ షరతు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంలో భాగంగానే సావంత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతిచ్చే అంశంపై ఎన్సీపీ తర్జనభర్జనలు పడుతోంది. నిర్ణయాన్ని కాంగ్రెస్‌కు విడిచిపెట్టింది. శివసేనకు మద్దతివ్వడానికి ఎన్సీపీ సిద్ధంగానే ఉందని పార్టీ నేత నవాబ్ మాలిక్ ప్రకటించారు. కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచిచూస్తున్నామన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఈ పరిణామాల మధ్యలో ఇప్పటికే ఓ దఫా భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరిగి సాయంత్రం మరోసారి సమావేశమై సేనకు మద్దతివ్వడంపై నిర్ణయం తీసుకోనుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
