
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నిరాకరించిన నేపథ్యంలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది. సీఎం పీఠంపై కూర్చొనేది శివసేనకు చెందిన వ్యక్తేనని పునరుద్ఘాటించింది. భాజపా నిర్ణయం అనంతరం మాతోశ్రీ (ఉద్ధవ్ నివాసం)కి చేరుకున్న ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ‘‘శివసేన నాయకుడే సీఎం అవుతారని ఉద్ధవ్జీ మా ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టి తీరుతాం’’ అని స్పష్టంచేశారు.
రాష్ట్రపతి పాలన కోరుకోవడం లేదు: చవాన్
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని ఆ పార్టీ నేత అశోక్ చవాన్ అన్నారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోరతామని చెప్పారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
