close

తాజా వార్తలు

‘మహా’ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్‌!

దిల్లీ: మహారాష్ట్ర, హరియాణాల్లో పోలింగ్‌ ముగిసింది. దీంతో పలు జాతీయ మీడియా సంస్థలు తమ సర్వేలను విడుదల చేశాయి. ఆయా సర్వేలన్నింటిలోనూ రెండు రాష్ట్రాల్లో మళ్లీ కమల దళమే వికసిస్తుందని తేల్చాయి. మహారాష్ట్రలో భాజపా - శివసేన కూటమిగా ఎన్నికల బరిలో నిలవగా.. కాంగ్రెస్‌ - ఎన్సీపీ కలిసి పోటీచేశాయి. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాలు ఉండగా అధికారంలోకి రావాలంటే 145 సీట్లు రావాల్సి ఉంది. అలాగే, హరియాణాలోనూ కమలమే వికసిస్తుందని సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మొత్తం 90 స్థానాలు ఉండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 46. ఏ జాతీయ సర్వే ఎలా ఉందో చూద్దాం. 

మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్‌

హరియాణా ఎగ్జిట్‌ పోల్స్‌

టైమ్స్‌ నౌ: భాజపా, శివసేన కూటమి 230; కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమి 48; ఇతరులు 10

న్యూస్‌ 18 - ఐపీఎస్‌వోఎస్‌: భాజపా 141; శివసేన 102; కాంగ్రెస్‌ 17; ఎన్సీపీ 22; ఇతరులు 4

ఇండియా టుడే - యాక్సిస్‌ మై ఇండియా: భాజపా 109 - 124; శివసేన 57 - 70 ; కాంగ్రెస్ 32 - 40; ఎన్సీపీ 40 - 50; ఇతరులు 24- 34

టీవీ 9 మరాఠీ - సీసెరో: భాజపా+ శివసేన కూటమి 197; కాంగ్రెస్‌ - ఎన్సీపీ కూటమి 75; ఇతరులు 16

జన్‌కీ బాత్‌ : భాజపా+ శివసేన కూటమి 223; కాంగ్రెస్‌+ ఎన్సీపీ కూటమి 54; ఇతరులు 11

ఏబీపీ న్యూస్‌ సీ- ఓటర్‌: భాజపా+ శివసేన కూటమి 204; కాంగ్రెస్‌+ ఎన్సీపీ కూటమి 69; ఇతరులు 15

న్యూస్‌ ఎక్స్‌: భాజపా 144- 150; శివసేన 44 - 80 ; కాంగ్రెస్ 40 - 50; ఎన్సీపీ 34 - 39; ఇతరులు 6- 10

టైమ్స్‌ నౌ : భాజపా 71,  కాంగ్రెస్‌ 11; ఐఎన్‌ఎల్‌డీ + అకాలీ 0; ఇతరులు 8

ఇండియా న్యూస్‌ : భాజపా 75- 80; కాంగ్రెస్‌ 9-12; ఐఎన్‌డీ- అకాలీ 0-1; ఇతరులు 1- 3

న్యూస్‌ ఎక్స్‌: భాజపా 75 - 80; కాంగ్రెస్‌ 9-12; ఐఎన్‌ఎల్‌డీ + అకాలీ 0-1

ఏబీపీ సీ - ఓటర్‌: భాజపా 72; కాంగ్రెస్‌ 8; ఇతరులు 10

వీడీపీఏ : భాజపా 71- 77; కాంగ్రెస్‌ 5-9; ఇతరులు 7- 12



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.