close

తాజా వార్తలు

‘ఈప్రభుత్వానికి ఆవులపై ప్రేమంతా కాగితాల్లోనే’

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విమర్శలు

 

దిల్లీ: దేశంలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.  ఆవులపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఉద్యోగ సంక్షోభంపైనా ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. చిదంబరం తరఫున ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ట్వీట్‌ చేశారు.

తాము అడిగినవారిలో 50శాతానికి పైగా మంది ప్రస్తుతం దేశంలో ఉపాధి దారుణంగా ఉందన్నారనీ.. 30శాతానికి పైగా మంది నిరుద్యోగం మరింత తీవ్రతరమవుతుందని చెప్పారని పేర్కొన్నారు. ‘‘దేశీయంగా పశువుల సంఖ్య 2012 - 2019 మధ్య కాలంలో 6శాతం పడిపోయింది. అంటే, ఈ ప్రభుత్వానికి గోవులపై ఉన్న ప్రేమంతా కేవలం కాగితాలపైనే’’ అని విమర్శించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన చిదంబరం ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.