close

తాజా వార్తలు

రాష్ట్రం రోగాలతో అల్లాడుతోంది:భట్టి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం రోగాలతో అల్లాడుతోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్‌ థియేటర్లలో శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలేమీ లేవని అన్నారు.ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నించారు. గత  6 సంవత్సరాలుగా పరిశుభ్రత కోసం గ్రామాలకు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రుల్లో శానిటేషన్‌ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం లేదని, అందువల్ల వాళ్లు పనిచేయడానికి నిరాకరిస్తున్నారని అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.