Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009303
            [news_title_telugu_html] => 

‘ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేలా వైకాపా పాలన’

[news_title_telugu] => ‘ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేలా వైకాపా పాలన’ [news_title_english] => MP Sujana Choudary Comments on Ap Govt [news_short_description] => ప్రజా సమస్యలపై వైకాపా ప్రభుత్వానికి ధ్యాస లేదని భాజపా ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. వైకాపా వందరోజుల పాలన ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. విజయవాడలో సుజనా మీడియాతో మాట్లాడారు. పోలవరం స్వాతంత్ర్యం.... [news_tags_keywords] => Sujana Choudary,BJP,AP Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 16:27:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేలా వైకాపా పాలన’ - MP Sujana Choudary Comments on Ap Govt - EENADU
close

తాజా వార్తలు

‘ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేలా వైకాపా పాలన’

అమరావతి: ప్రజా సమస్యలపై వైకాపా ప్రభుత్వానికి ధ్యాస లేదని భాజపా ఎంపీ సుజనాచౌదరి విమర్శించారు. వైకాపా వందరోజుల పాలన ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. విజయవాడలో సుజనా మీడియాతో మాట్లాడారు. పోలవరం స్వాతంత్ర్యం రాకముందే ప్రణాళిక వేసిన ప్రాజెక్టు అని చెప్పారు. 70 ఏళ్లుగా ఆ ప్రాజెక్టును జీవనాడిగా చెప్పుకుంటున్నామన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలవరం టెండర్ల విధానంలో తప్పు జరిగిందని.. 14 శాతం తక్కువకు కాంట్రాక్టు ఇచ్చారని సుజనా చెప్పారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు అథారిటీ అనుమతితోనే పోలవరం నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. 

రూ.500 కోట్లు కాదు..రూ.5 కూడా తగ్గించలేరు

ఎవరైనా అవినీతికి పాల్పడితే వ్యక్తిగతంగా శిక్షించాలే కానీ అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులను వైకాపా ప్రభుత్వం రద్దు చేయడం మంచిది కాదని సుజనాచౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం వారిస్తున్నా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నారని విమర్శించారు. రివర్స్‌ టెండర్ల ద్వారా రూ.500 కోట్లు మిగలేస్తామంటున్నారని.. రూ.5 కూడా తగ్గించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసుంటే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదన్నారు. పోలవరం విషయంలో కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని.. ఆ ప్రాజెక్టు ఆలస్యమయ్యేకొద్దీ ఏటా రూ.20వేల కోట్ల వ్యవసాయ ఉత్పాదకత నష్టపోతామన్నారు. ముంపులేని గ్రామాలు కూడా ప్రభుత్వ వైఫల్యంతో ముంపునకు గురయ్యాయని సుజనా ఆరోపించారు. ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా వ్యవహరిస్తోందన్నారు. రాజధాని విషయంలోనూ ప్రభుత్వ వ్యవహారశైలి ఇలాగే ఉందని.. రైతులు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాజపా చూస్తూ ఊరుకోదని సుజనా హెచ్చరించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.