Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144630
            [news_title_telugu_html] => 

జైనులపై దాడి హేయం: ఎంపీ తేజస్వి

[news_title_telugu] => జైనులపై దాడి హేయం: ఎంపీ తేజస్వి [news_title_english] => BJPs Tejasvi Surya Slams Kannada Group For Vandalising Hindi Banners [news_short_description] => కర్ణాటకలోని బెంగళూరులో కొందరు కన్నడ కార్యకర్తలు హిందీ బ్యానర్‌లు ప్రదర్శించిన జైనులపై దాడులు చేయడాన్ని ఎంపీ తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు నిజమైన ప్రాంతీయ భాషా ప్రేమికులకు అపఖ్యాతి తెస్తాయన్నారు. [news_tags_keywords] => tejaswi surya,kannada activists,attack on jains,bengalore [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:31:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జైనులపై దాడి హేయం: ఎంపీ తేజస్వి - BJPs Tejasvi Surya Slams Kannada Group For Vandalising Hindi Banners - EENADU
close

తాజా వార్తలు

జైనులపై దాడి హేయం: ఎంపీ తేజస్వి

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో కొందరు కన్నడ కార్యకర్తలు హిందీ బ్యానర్‌లు ప్రదర్శించిన జైనులపై దాడి చేయడాన్ని భాజపాకు చెందిన బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు నిజమైన ప్రాంతీయ భాషా ప్రేమికులకు అపఖ్యాతి తెస్తాయన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘బెంగళూరులో కొందరు ద్రోహులు.. జైన సోదరుల ప్రార్థనా మందిరానికి వెళ్లి హిందీ భాషలో ఉన్న బ్యానర్లను ధ్వంసం చేసి వారిపై దాడి చేయడం బాధాకరం. హిందీ బ్యానర్లకు వ్యతిరేకంగా దాడులు చేసిన వీరు బెంగళూరులో ఉర్దూ భాష వాడకంపై ఎప్పుడూ ప్రశ్నించరు. కానీ ప్రశాంతంగా ఉండి కర్ణాటక కోసం కృషి చేసే జైన సోదరులపై దాడులు చేశారు. ఇది ఎంతో బాధాకరమైన విషయం’ అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎంపీ మతపరమైన కోణంలో స్పందించారని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించగా, కొందరు కన్నడ భాషా కార్యకర్తలు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు.
బెంగళూరులోని జైనుల ప్రార్థనా మందిరం ముందు హిందీలో బ్యానర్లు ఉండటంతో శనివారం కొందరు కన్నడ కార్యకర్తలు వారిపై దాడి చేశారు. అనంతరం వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివాదంపై కాంగ్రెస్‌ నాయకులు సిద్దరామయ్య ట్విటర్‌ ద్వారా పేర్కొంటూ.. బ్యానర్లు తొలగించినందుకు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నడ ప్రజల మనోభావాలను, భాషను గౌరవించాలన్నారు. కర్ణాటకలో హిందీ బోర్డులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2017లో కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు బెంగళూరు మెట్రో స్టేషన్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న హిందీ బోర్డులకు నల్ల రంగు వేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.