
తాజా వార్తలు
గులాబి టెస్టు సందర్భంగా దిగ్గజాల చర్చ
కోల్‌కతా: చారిత్రక డే/నైట్ టెస్టు సందర్భంగా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లంతా మళ్లీ ఒక్క చోట కలిశారు. ఈడెన్ గార్డెన్స్‌లో అలనాటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. గులాబి బంతి టెస్టు నేపథ్యంలో సచిన్ తెందూల్కర్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ తమ అనుభూతులను పంచుకున్నారు. 1993లో వెస్టిండీస్‌పై హీరోకప్ ఫైనల్, 2001లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ గురించి ముచ్చటించుకున్నారు. చాలారోజుల తర్వాత అందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చిన బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ సారథి సౌరవ్ గంగూలీకి వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్, బంగ్లా రెండో టెస్టు భోజన విరామంలో వీరి ముచ్చట కొనసాగింది.
‘వీడ్కోలు తర్వాత ఇలా అందరం కూర్చొని మాట్లాడుకొనే అవకాశం రాలేదు. ఇదో ప్రత్యేకమైన రోజు. చారిత్రక మ్యాచ్‌కు ఇంతకన్నా మంచి వేదిక మరొకటి ఉండదు’ అని అనిల్ కుంబ్లే చర్చను మొదలు పెట్టారు. హీరోకప్ ఫైనల్లో ఆయన వెస్టిండీస్‌పై 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశారు. చర్చ జరుగుతున్నప్పుడు కోల్‌కతాలోని అభిమానులు సచిన్.. సచిన్ నినాదాలతో స్టేడియాన్ని మార్మోగించారు. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ 376 పరుగుల భాగస్వామ్యాన్ని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఆసీస్ టెస్టులో హ్యాట్రిక్ సహా 13 వికెట్లు తీసిన భజ్జీని అభినందించారు. ‘హ్యాట్రిక్ వల్లే ఆట వేగంగా మలుపు తిరిగింది. మేం ఆ మ్యాచ్ గెలిచిన విధానం భారత క్రికెట్‌ను సరికొత్త దశకు తీసుకెళ్లింది. భజ్జీ ఓ సంచలనం. రికీ పాంటింగ్‌ను చాలాసార్లు ఔట్ చేశాడు. లక్ష్మణ్, ద్రవిడ్ భాగస్వామ్యం డ్రస్సింగ్ రూమ్ ఆత్మవిశ్వాసం పెంచడంలో అద్భుతాలు చేసింది’ అని సచిన్ అన్నారు.
ఈడెన్ గార్డెన్‌లోని అభిమానుల సందడి ఒకప్పటి రోజుల్ని గుర్తుకుతెచ్చిందని భజ్జీ అన్నారు. ‘ఈ వాతావరణం నన్ను 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది. అప్పట్లో టెస్టు క్రికెట్ భిన్నంగా ఉండేది. ఈ అనుభూతి ఎంతో బాగుంది. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ ఎంతో బాగుంటుంది. ఇదంతా చేసిన గంగూలీకి హ్యాట్సాఫ్. నేను 100 మంది సారథుల కింద ఆడినా ఆయనే నా చిరకాల నాయకుడు’ అని భజ్జీ పేర్కొన్నారు. హర్భజన్ గురించి తొలిసారి తాను విన్న సంగతుల గురించి సచిన్ పంచుకున్నారు. ‘భజ్జీని నేను తొలిసారి మొహాలిలో కలుసుకున్నా. అక్కడి ప్రజలు అతడి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అతనో మంచి స్పిన్నర్, దూస్రాలు బాగా విసురుతాడని చెప్పారు’ అని సచిన్ వెల్లడించారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ఈ చర్చలో పాల్గొనాల్సి ఉన్నా అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వల్ల కుదర్లేదు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
