
తాజా వార్తలు
దిల్లీ: డే/నైట్ టెస్టులో పేసర్లను ఉపయోగించుకొనేటప్పుడు రెండు జట్ల సారథులు వినూత్నంగా ఆలోచించాలని టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయిస్తే వారు మరింత సమర్థంగా రాణిస్తారని వెల్లడించాడు. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా శుక్రవారం భారత్, బంగ్లాదేశ్ తొలి గులాబి బంతి టెస్టు ఆడుతున్న సంగతి తెలిసిందే.
‘ఫాస్ట్ బౌలర్లను సారథులు వినూత్నంగా వాడుకోవాలి. ఎరుపు బంతి క్రికెట్లో పేసర్లను ఉదయం వినియోగించుకుంటారు. డే/నైట్ మ్యాచులో వారిని మధ్యాహ్నం ఒంటి గంటకు కాకుండా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఉపయోగించుకుంటే సమర్థంగా రాణించగలరు. ఎస్జీ గులాబి బంతి ఎలా ప్రవర్తిస్తుందో చూడాలని ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే నేను కూకాబుర్ర గులాబితో ఆడాను. ఎస్‌జీతో ఆడలేదు. లైట్ల వెలుతురులో మణికట్టు స్పిన్నర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. చేతిలోంచి బంతి బయటకు వస్తున్నప్పుడు గమనించకపోతే ఆడటం సవాల్‌గా ఉంటుంది. బ్లాక్థీమ్ ఉండి, కృత్రిమ వెలుతురుకు అలవాటు పడితే మణికట్టు స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు’ అని గౌతీ అన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
