
తాజా వార్తలు
కోల్‌కతా: సన్నాహక మ్యాచ్ ఉంటేనే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో గులాబి టెస్టు ఆడతామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. హఠాత్తుగా పింక్ టెస్ట్ ప్రతిపాదన తీసుకురావడంతోనే 2017-18 పర్యటనలో ఆడకపోవడానికి కారణమని వెల్లడించాడు. ఈడెన్ వేదికగా టీమిండియా తొలిసారి బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్టు ఆడుతున్న సందర్భంగా విరాట్ మీడియాతో మాట్లాడాడు.
‘ఆస్ట్రేలియాతో గులాబి టెస్టు ఎప్పుడు పెట్టినా ముందు సన్నాహక మ్యాచ్ కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే గులాబి బంతి క్రికెట్‌కు మేం ముందుగానే అలవాటు పడాలి. దానిని అనుభూతి చెందాలి. ఇలాంటివన్నీ ఒక భారీ పర్యటనలో, షెడ్యూలులో అకస్మాత్తుగా మార్పు చేయకూడదు. గతేడాది ఆసీస్ ప్రతిపాదించినప్పుడు గులాబితో మేం సాధన సైతం చేయలేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెటైనా ఆడలేదు. ఏదైనా సరే హఠాత్తుగా వద్దు’ అని విరాట్ అన్నాడు.
తన మనసు మార్చుకోవడంపై కోహ్లీని ప్రశ్నించగా ‘వారం రోజుల్లో మీరు గులాబి బంతితో ఆడబోతున్నారని రోజుల ముందు చెప్పొద్దు. ఏ విధంగా చూసినా ఇది తర్కం అనిపించుకోదు. ఇందుకు కాస్త సాధన, సన్నాహకం అవసరం. ఒకసారి దీనికి అలవాటు పడితే మరెప్పుడైనా ఆడేందుకు ఇబ్బంది ఉండదు. గులాబి టెస్టుల గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. మన వాతావరణ పరిస్థితుల్లో గులాబి బంతి ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి. ఎక్కువ స్వింగ్ అవుతుందేమో గమనించాలి. ఆ తర్వాత ఎక్కడికెళ్లైనా కీలకమైన టెస్టు సిరీసుల్లో ఆడొచ్చు. డే/నైట్ మ్యాచుల్లో మంచు కీలకం అవుతుంది. ఆఖరి సెషన్లో దానిని ఎలా ఎదుర్కొంటామో చూడాలి’ అని కోహ్లీ వెల్లడించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
