
తాజా వార్తలు
పురుషులు ఏడ్చినంత మాత్రాన బలహీనులైపోరన్న మాస్టర్
ముంబయి: మగాళ్లు ఏడ్చినంత మాత్రాన సిగ్గుపడాల్సిందేమీ లేదని టీమిండియా పరుగుల వీరుడు సచిన్ తెందూల్కర్ అన్నారు. గతంలో తన అభిప్రాయం అలాగే ఉండేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ పురుషుల వారోత్సవాల సందర్భంగా పురుషులందరికీ సచిన్ ఓ బహిరంగ లేఖ రాశారు. ‘కన్నీరు కారిస్తే తప్పేం కాదు. నిన్ను బలవంతుడిని చేసే ఒక భాగాన్ని ఎందుకు దాచుకోవాలి? కన్నీళ్లను ఎందుకు దాచాలి? ఎందుకంటే అదే నిజమని నమ్ముతూ మనం పెరిగాం. ఏడుపు మగాళ్లను బలహీనులను చేస్తుందని విశ్వసించాం. ఇదే నిజమని వింటూ నేనూ పెరిగాను. అది తప్పని తెలుసుకున్నాను కాబట్టే ఈ లేఖ రాస్తున్నాను. నా కష్టాలు, బాధలే ఇప్పటి నన్ను తయారు చేశాయి. మెరుగైన వ్యక్తిగా మార్చాయి’ అని సచిన్ అన్నారు.
‘మన బాధను ప్రదర్శించేందుకు చాలా ధైర్యం అవసరం. ప్రతిరోజు తప్పకుండా ఉదయిస్తున్నట్టే కష్టాల నుంచి శక్తిమంతులవుతారు. అందుకే ఇలాంటి అపోహల నుంచి బయట పడండి. భావోద్వేగాలు బయట పెట్టేందుకు ధైర్యం చేయండి. నేనూ ఆందోళన, బాధలు, సందేహాలను ఎదుర్కొన్నాను. ఏడుపొస్తే ఏడవడంలో తప్పులేదు. ఆ తర్వాత మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే మగాళ్లు చేయాల్సింది అదే. వీడ్కోలు సందేశం ఇచ్చేటప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఆఖరి సారి ఔటై పెవిలియన్ ఒక్కోమెట్టు ఎక్కుతున్నప్పుడు కుంగిపోతున్నట్టు అనిపించింది. గొంతు పూడుకుపోయింది. నా బుర్రలో ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. నాలో దాచుకోలేకపోయాను. వాటితో పోరాడలేకపోయాను. ఏదేమైనప్పటికీ నేను ప్రపంచం ముందుకు వెళ్లినప్పుడు ఆశ్చర్యంగా ప్రశాంతత లభించింది. నా కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా అనిపించింది’ అని సచిన్ ఆ లేఖలో రాశారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
