close

తాజా వార్తలు

సంజుకు చోటుందా: రేపే వన్డే, టీ20 జట్ల ఎంపిక

ముంబయి: వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసుల కోసం గురువారం జట్లను ప్రకటించే అవకాశం ఉంది. చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ రేపు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుందని సమాచారం. వెస్టిండీస్‌ డిసెంబర్‌ 6 నుంచి ఉపఖండంలో పర్యటించనుంది. టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ ధోనీపై అందరి దృష్టి నెలకొంది.

చాన్నాళ్ల తర్వాత ఝార్ఖండ్‌ మైదానంలో సాధన చేయడంతో అభిమానులు మహీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా అతడు ఈ సిరీసులకు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐలోని ఓ సీనియర్‌ అధికారి గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. రిషభ్‌ పంత్‌ బ్యాటు, గ్లోవ్స్‌తో విఫలమవుతున్నప్పటికీ మళ్లీ అవకాశం ఇస్తారనే తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో చోటు దక్కని సంజు శాంసన్‌కు ఈ సారైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి. యువ బౌలర్ల ఎంపికలో ఎలాంటి మార్పులు ఉంచకపోవచ్చని తెలుస్తోంది. టీ20లు రాత్రి 7 గంటలు, వన్డేలు మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభమవుతాయి.

భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన వివరాలు

తొలి టీ20 - డిసెంబర్‌ 6, శుక్రవారం (ముంబయి)

రెండో టీ20 - డిసెంబర్‌ 8, ఆదివారం (తిరువనంతపురం)

మూడో టీ20- డిసెంబర్‌ 11, బుధవారం (హైదరాబాద్‌)

తొలి వన్డే - డిసెంబర్‌ 15, ఆదివారం (చెన్నై)

రెండో వన్డే - డిసెంబర్‌ 18, బుధవారం (విశాఖపట్నం)

మూడో వన్డే - డిసెంబర్‌ 22, ఆదివారం (కటక్‌)


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.