
తాజా వార్తలు
ఇండోర్: భారత్, బంగ్లా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యే చారిత్రక డేనైట్ టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. ఈ సందర్భంగా బంగ్లా ఆటగాళ్లు ఒకడుగు ముందుకేసి పింక్ బాల్‌ను నీళ్లలో ముంచి మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. డేనైట్ టెస్టుపై మంచు ప్రభావం ఉన్నందున ఆ పరిస్థితులకు అలవాటు పడేలా ప్రాక్టీస్ చేస్తున్నామని బంగ్లా స్పిన్నర్ మెహిది హసన్ తెలిపాడు. తొలి టెస్టు మూడు రోజుల్లోనే పూర్తి అయినా.. భారత్, బంగ్లా జట్లు ఇండోర్‌లోనే ఉండి అక్కడే ఫ్లడ్‌లైట్ల కింద ప్రాక్టీస్ చేశాయి.
కాగా, సోమవారం బంగ్లా ఆటగాళ్లు సుమారు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేయడం విశేషం. ప్రధాన కోచ్ రసెల్ డొమింగో ఆధ్వర్యంలో క్యాచులు పట్టడంలో శిక్షణ పొందారు. ఈ మూడు రోజులు కూడా తమ పేస్ బౌలర్లు బంతిని తడిగా చేసి ప్రాక్టీస్ చేస్తారని, ఈ విధంగా పింక్ బాల్ టెస్టుకు అలవాటు పడతామని హసన్ వివరించాడు. బంతి తడిగా మారితే.. అది జారుతుందని, అయినా స్పిన్నర్లకు బౌన్స్, టర్న్ లభిస్తుందని తెలిపాడు. ‘నేను పింక్ బాల్‌తో బ్యాటింగ్ చేశా. బంతి పిచ్‌కు తాకగానే వేగంగా కదులుతోంది. బ్యాట్‌పైకి కూడా త్వరగా వచ్చేస్తుంది. అలాగే ఎక్కువ స్వింగ్ అవుతోంది. అయినా, బ్యాట్స్‌మన్ కట్ షాట్లు ఆడొచ్చు’ అని చెప్పుకొచ్చాడు.
‘పింక్ బాల్‌కు మేమింకా అలవాటు పడలేదు. దానితో ఆడటానికి ఎక్కువ సమయం దొరకలేదు. అయినా వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి కృషి చేస్తాం. ఈ బంతితో ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడే కొద్ది అలవాటు పడతారు. అలాగే బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు అలవాటు పడే వరకూ ఉండాల్సిందే. క్యాచులు పట్టేటప్పుడు, ఫీల్డింగ్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బందులేమీ లేవు. అయినా మ్యాచ్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి బంతి కూడా కనపడదు’ అని బంగ్లా స్పిన్నర్ హసన్ పేర్కొన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
