close

తాజా వార్తలు

మయాంక్‌ శతకం.. ఆధిక్యం దిశగా భారత్‌

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌(101; 186 బంతుల్లో 15x4, 1x6) శతకంతో ఆకట్టుకున్నాడు. అతడికి ఇది మూడో టెస్టు శతకం కావడం విశేషం. ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో ద్విశతకం బాదిన మయాంక్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(42; 88 బంతుల్లో 6x4) అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. 60 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 206/3తో నిలిచింది. కెప్టెన్‌ కోహ్లీ(0) ఔటయ్యాక మయాంక్‌, రహానె 87 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.