close

తాజా వార్తలు

హాకీలో అదరగొడుతున్నా.. చేయూత కరవాయే!

సిమ్లా‌: క్రీడల పట్ల ఇష్టం, ఆడగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే వయసు అడ్డుకాదని నిరూపించారు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన మహిళలు. 50 ఏళ్లు పైబడిన వీళ్లంతా హాకీలో జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారు. ఓ వైపు గృహిణులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆటపై ఉన్న మక్కువతో ముందుకుసాగుతున్నారు. ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ఈ మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఇటలీలో జరిగిన అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. అయితే, స్పాన్సర్‌షిప్‌ లేకపోవటం వల్ల అక్కడికి వెళ్లలేకపోయారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం బిలాస్‌పూర్‌లో జరుగుతున్న మాస్టర్‌ గేమ్స్‌ పోటీల్లో ఈ 50 ప్లస్‌ బృందం పాల్గొంటోంది.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.