close

తాజా వార్తలు

ప్రిక్వార్టర్స్‌కు చేరిన సౌరవ్

దోహా: భారత స్క్వాష్‌ ప్లేయర్‌ సౌరవ్ ఘోషల్‌ ప్రపంచ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు. రెండో రౌండ్‌లో ఫ్రెంచ్‌ ఆటగాడు లూకస్‌ను పదో సీడ్‌ సౌరవ్‌ 11-8, 11-5, 11-5 తేడాతో వరుస గేముల్లో మట్టికరిపించాడు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో సౌరవ్‌ పైచేయి సాధించాడు. ఆ తర్వాత రెండు గేముల్లో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు. మంగళవారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌ ఆటగాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ మహ్మద్‌తో అతడు తలపడనున్నాడు. తొలి రౌండ్‌లో భారత ఆటగాడైన మహేశ్‌ను సౌరవ్‌ 11-7, 11-7, 18-16 తేడాతో వరుస గేముల్లో ఓడించిన సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.