
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: నిండా నాలుగేళ్లు కూడా ఉండని ఓ బుడతడి క్రికెట్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అతడి బ్యాటింగ్ నైపుణ్యాలే అందుకు కారణం. వివరాల్లోకి వెళ్తే.. ఫాక్స్ క్రికెట్ సంస్థ తమ ట్విటర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో టీషర్టు, డైపర్ ధరించిన ఓ బుడతడు బ్యాటు పట్టుకుని ఇంట్లో క్రికెట్ ఆడుతుంటాడు. అది పోస్ట్ చేస్తూ నైపుణ్యాత్మక క్రికెటర్లా ఆడుతున్నాడు అని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆ వీడియోను చూసిన ఇంగ్లాండు మాజీ క్రికెటర్ ‘మైఖేల్ వాఘన్’ ఆ బుడతడి ఆటతీరుకు ఆకర్షితుడై తాను కూడా ట్విటర్లో షేర్ చేశాడు. గ్లౌవ్స్ కూడా ధరించి లాంగ్ ఆన్ షాట్లు, స్ట్రైట్ డ్రైవ్స్ ఇలా మంచి స్టిల్స్ ఇస్తూ బ్యాటింగ్‌లో తనదైన ప్రతిభ కనబరుస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ బుడతడి ఆటతీరును ప్రశంసిస్తున్నారు. ‘ఇదే అసలైన క్రికెట్ స్టైల్’ అని కొందరు, ‘సచిన్ తెందుల్కర్ మళ్లీ క్రికెట్లోకి రంగ ప్రవేశం చేశాడు’ అని మరికొందరు దీనిపై కామెంట్ల వర్షం కురిపించారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
