close

తాజా వార్తలు

గంగూలీ అధ్యక్ష పదవీకాలం పొడిగింపు?

ముంబయి: అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబయిలోని ప్రధాన కార్యాలయంలో డిసెంబర్‌ 1న దాదా నేతృత్వంలో సాధారణ వార్షిక సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ పాలక వర్గంలో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం కాగా, సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. ఒకవేళ కోర్టు అనుమతిస్తే దాదా ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాల్సి ఉంది. రెండోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలక వర్గం ఆ నిబంధనను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.