close

తాజా వార్తలు

చొరబాటు ప్రయత్నాలు 2018లోనే అత్యధికం

దిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర బృందాలు 2018లో జమ్మూలోకి చొరబడేందుకు 328 ప్రయత్నాలు చేశాయని హోంశాఖ ఓ నివేదికలో వెల్లడించింది. గత ఐదేళ్లలోనే ఇదే అత్యధికమని అందులో పేర్కొంది. ఈ మేరకు గత ఐదేళ్లలో జమ్మూలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదుల ప్రయత్నాలు, మరణించిన వారి సంఖ్యపై ప్రభుత్వం శుక్రవారం నివేదిక విడుదల చేసింది. అందులో భాగంగా 2018లో ఉగ్రవాదులు 328 చొరబాటు ప్రయత్నాలు చేసి 143 సార్లు కళ్లుగప్పి రాగలిగారని తెలిపింది. ఆ సంవత్సరంలో 257 ఉగ్రవాదులు, 91 భద్రతా సిబ్బంది, 39 మంది పౌరులు మృతి చెందినట్లు పేర్కొంది. 2017లో ఉగ్రవాదులు 419 ప్రయత్నాలు చేయగా 136 సార్లు రాగలిగారని, 2016లో 371కి గానూ 119, 2015లో 121కి గానూ 33, 2014లో 222కి గానూ 65 సార్లు భారత కళ్లు కప్పి రాగలిగారని పేర్కొంది. 

2017లో 342 ఉగ్రఘటనలు జరగ్గా 213 ఉగ్రవాదులు, 80 భద్రతా సిబ్బంది, 40 పౌరులు మరణించారు. 2016లో 322 ఉగ్రఘటనలు జరగ్గా 150 ఉగ్రవాదులు, 82 భద్రతా సిబ్బంది, 15 మంది పౌరులు మరణించారని వెల్లడించింది. గత రెండున్నర దశాబ్దాల నుంచి సరిహద్దుల నుంచి వస్తున్న ఉగ్రవాదులతో రాష్ట్రం బాగా ప్రభావితమవుతోందని వెల్లడించింది. 1990 నుంచి మార్చి 31, 2019 వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలతో మొత్తం 14024 మంది పౌరులు, 5273 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.