close

తాజా వార్తలు

స్మిత్‌కు అరుదైన గౌరవం

లండన్‌: మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) గౌరవ శాశ్వత సభ్యులుగా దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ టిమ్‌మే ఎంపికయ్యారు. ‘దక్షిణాఫ్రికా క్రికెట్‌ లెజెండ్‌ గ్రేమ్‌ స్మిత్‌ గౌరవ శాశ్వత సభ్యుడిగా ఎంసీసీలో చోటు దక్కింది. ఆయనతో పాటు ఆస్ట్రేలియా స్పిన్నర్‌ టిమ్‌మే కూడా ఎంపిక అయ్యారు’ అని లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్ ట్విటర్‌లో పేర్కొంది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కాలింగ్‌వుడ్‌, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, ఆసీస్‌ మాజీ పేసర్ మిచెల్‌ జాన్సన్‌కు కూడా ఎంసీసీ శాశ్వత సభ్యులుగా గౌరవం దక్కిన విషయం తెలిసిందే.

22 ఏళ్లకే గ్రేమ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికా జట్టుకు సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. సఫారీసేనకు కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించిన స్మిత్ జట్టును విజయపథంలో నడిపించాడు. దక్షిణాఫ్రికా తరఫున 117 టెస్టుల్లో 48.25 సగటుతో 9,265 పరుగులు, 197 వన్డేల్లో 37.98 సగటుతో 6,989 పరుగులు బాదాడు. అతడి తొలి ఇంగ్లాండ్‌ పర్యటనలోనే లార్డ్‌ మైదానంలో దిగ్గజ క్రికెటర్ బ్రాడ్‌మన్‌ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (259) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టిమ్‌మే ఆస్ట్రేలియా తరఫున 24 టెస్టులు, 47 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 75 వికెట్లు, వన్డేల్లో 39 వికెట్లు పడగొట్టాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.