close

తాజా వార్తలు

ఉమేశ్‌ బౌన్సర్‌కు ఎల్గర్‌ విలవిల: ఫిజియో రాక

తేనీటి విరామానికి దక్షిణాఫ్రికా 26/4

రాంచి: భారత్‌తో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా కష్టాలు కొనసాగుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు ఫాలో ఆన్‌లోనూ అదే తరహాలో ఆడుతోంది. తేనీటి విరామానికి 26/4తో నిలిచింది. మహ్మద్‌ షమి (3/7) చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నాడు. వాటిని ఆడలేక సఫారీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ఎండ్‌లో ఉమేశ్‌ (1/18) సైతం కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. వీరిద్దరూ ఒక క్రమపద్ధతిలో విరుచుకుపడటంతో పర్యాటక జట్టుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం డీన్‌ ఎల్గర్‌ (16; 29 బంతుల్లో 3×4), హెన్రిచ్‌ క్లాసెన్‌ (0; 3 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన 9.3వ బంతికి డీన్‌ ఎల్గర్‌ హెల్మెట్‌కు బలంగా తగిలింది. తడబడ్డ ఎల్గర్‌ క్రీజులో కూలబడ్డాడు. వెంటనే ఆ జట్టు ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకువచ్చాడు. కాంకషన్‌ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దీంతో అంపైర్లు తేనీటి విరామం ప్రకటించారు. అంతకు ముందు షమి వేసిన 8.3వ బంతికి బవుమా (0; 3 బంతుల్లో), 6.6వ బంతికి సఫారీ సారథి డుప్లెసిస్‌ (4; 10 బంతుల్లో) ఔటయ్యారు. వికెట్ల ముందు దొరికిపోయిన డుప్లెసిస్‌ సమీక్ష కోరినప్పటికీ ఫలితం అతడికి అనుకూలంగా రాలేదు. దక్షిణాఫ్రికా 309 పరుగుల వెనుకంజలో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.