close

తాజా వార్తలు

రోహిత్‌శర్మ నీ ప్రత్యేకతని కొనసాగించు

టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌

దిల్లీ: టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ టెస్టుల్లో ఓపెనింగ్‌ చేస్తే తన ప్రత్యేకతను కొనసాగించాలని మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. టెస్టుల్లో అతడు ఓపెనర్‌గా మంచి ప్రదర్శన చేస్తే టీమిండియా భారీ టార్గెట్లను సైతం ఛేదించగలదని చెప్పాడు. వెస్టిండీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కి బదులు దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ ఐదు రోజుల క్రికెట్‌లో ఓపెనింగ్‌ చేయనున్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని విధంగా మూడుసార్లు డబుల్‌ సెంచరీ చేసిన రోహిత్‌.. టీ20ల్లో నాలుగు శతకాలు బాదాడు. అయినా టెస్టు క్రికెట్‌లో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. విండీస్‌ పర్యటనలో రెండు టెస్టు మ్యాచ్‌ల జాబితాలో అతడి పేరు ఉన్నా ఆడే అవకాశం దక్కలేదు. కాగా జట్టు యాజమాన్యం అతడిని మిడిలార్డర్‌లో కొనసాగించాలని చూసినా తెలుగుతేజం హనుమవిహారి విండీస్‌ పర్యటనలో రాణించి ఆరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రోహిత్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. 

‘టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ రాణించేందుకు ఇది చక్కటి అవకాశం. అతడు తన ప్రత్యేకతను కొనసాగిస్తే తప్పకుండా విజయవంతమౌతాడు. కాకపోతే సంప్రదాయ క్రికెట్‌లో ఓపెనింగ్‌ చేసి చాలా రోజులైనందున కాస్త ఇబ్బంది పడే అవకాశముంది. అతడు గనుక రాణిస్తే టీమిండియా పెద్ద లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించగలదు’ అని సంజయ్‌ అన్నాడు. రోహిత్‌ ఇప్పటివరకూ 27 టెస్టులాడి కేవలం 1585 పరుగులు మాత్రమే చేశాడు. అందులో మూడు శతకాలు, పది అర్ధశతకాలు ఉన్నాయి. దీంతో టెస్టుల్లో అతడి సగటు 39.62గా నమోదైంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.