Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144999
            [news_title_telugu_html] => 

కోహ్లీ@11.. టాప్‌-10 రికార్డులు

[news_title_telugu] => కోహ్లీ@11.. టాప్‌-10 రికార్డులు [news_title_english] => Ten impressive records held by Indian cricket team skipper Virat Kohli [news_short_description] => భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తయ్యాయి. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజుగా పేరుగాంచాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 10:48:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోహ్లీ@11.. టాప్‌-10 రికార్డులు - Ten impressive records held by Indian cricket team skipper Virat Kohli - EENADU
close

తాజా వార్తలు

కోహ్లీ@11.. టాప్‌-10 రికార్డులు

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తయ్యాయి. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టాడు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. పరుగుల యంత్రం, రికార్డుల రారాజుగా పేరుగాంచాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. అసాధ్యమన్న రికార్డులను సుసాధ్యం చేస్తూ విమర్శకులకు సమాధానం చెప్పాడు. క్రికెట్‌ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తన కంటూ కొన్ని పేజీలను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. సచిన్‌ వారసుడిగా అడుగుపెట్టిన కోహ్లీ.. సచిన్‌ రికార్డులనెన్నో తన పేరుతో తిరగరాశాడు. ఫార్మాట్ ఏదైనా నిలకడే నా స్టైల్ అంటూ పరుగుల వరద పారించాడు. మ్యాచ్‌లో మూడంకెల స్కోరుని అందుకోకపోతే కోహ్లీ ఫామ్‌లో లేడు.. అని అనుకునే రీతిలో క్రికెట్‌ అభిమానులు అతడిని ఆరాధిస్తున్నారంటే అతియోశక్తి కాదు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తున్న కోహ్లీ రికార్డులలో టాప్ 10 ఏంటంటే..

ఛేదన రారాజు..
ఛేదనలో సహచరులు ఒకరి తర్వాత ఒకరు వెనుదిరుగుతుంటే ఏ ఆటగాడైనా తడబడుతుంటాడు. కానీ కోహ్లీ అలాంటి పరిస్థితుల్లో విజృంభిస్తుంటాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా ప్రత్యర్థులను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటాడు. అందుకే కోహ్లీని ఛేదన రారాజుగా పిలుస్తారు. వన్డేల్లో కోహ్లీ 43 శతకాలు సాధించగా అందులో 26 ఛేదనలోనివే. ఈ 26 శతకాల్లో అతడు 22 సార్లు జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఛేదనలో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత స్థానాల్లో సచిన్‌ తెందూల్కర్‌ (17), రోహిత్ శర్మ (13) ఉన్నారు.  

కోహ్లీ @20K
ఒక దశాబ్దకాలంలో 20 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. అతడు మూడు ఫార్మాట్లలో కలిపి ఈ దశాబ్దంలో 20,018 పరుగులు సాధించాడు. కెరీర్‌లో మొత్తం అతడు 20,502 పరుగులు చేశాడు. ఒక దశాబ్దకాలంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పాంటింగ్‌ 18,962 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్‌ తర్వాత దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్ కలిస్‌ (16,777), శ్రీలంక ఆటగాళ్లు జయవర్ధనే (16,304), కుమార సంగక్కర (15,999) ఉన్నారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (15,962) ఆరో స్థానంలో ఉన్నాడు.

డబుల్స్‌లోనూ టాప్‌
కోహ్లీ కెప్టెన్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో సారథిగా ఆరు డబుల్‌ సెంచరీలను బాదాడు. అతడి తర్వాత వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌ బ్రయన్ లారా (5), ఆస్ట్రేలియా మాజీ సారథి బ్రాడ్‌మన్ (4) ఉన్నారు. కోహ్లీ శ్రీలంకపై రెండు సార్లు.. వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌పై ఒక్కో డబుల్‌ సెంచరీని బాదాడు. 


ఉత్తమ సారథి
వన్డేల్లో కెప్టెన్‌గా కోహ్లీ అత్యధిక గెలుపు శాతాన్ని (72.50%) కలిగి ఉన్నాడు. అతడు భారత్‌ తరఫున ఇప్పటివరకు 80 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 58 మ్యాచుల్లో గెలవగా 19 మ్యాచుల్లో ఓటమిని చవిచూశాడు. ఒక మ్యాచ్‌ టైగా మారగా, రెండు మ్యాచులకు ఫలితం తేలలేదు.  

సచిన్‌ను దాటి.. 
వన్డేల్లో అతి తక్కువ కాలంలో పదివేల పరుగులను అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 213 మ్యాచుల్లో 10 వేల పరుగులను అందుకున్న అతడు ఈ ఘనతను సాధించడానికి 10 సంవత్సరాల 67 రోజుల సమయాన్ని తీసుకున్నాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ పదివేల పరుగులు సాధించడానికి 11 సంవత్సరాల 103 రోజుల సమయం పట్టింది. 

కెప్టెన్‌గా సెంచరీల్లో.. 

 బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఎన్నో రికార్డులను అందుకున్న కోహ్లీ సారథిగా మరో రికార్డును బద్దలుకొట్టాడు. ఒకే ఏడాదిలో అత్యధిక సెంచరీలు బాదిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 2017, 2018లో ఏడాదికి ఆరు సెంచరీల చొప్పున బాదాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ గంగూలీ, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఉన్నారు. ఈ ముగ్గురూ ఒక ఏడాదిలో తలో ఐదు సెంచరీలు చేశారు. 

సగటులో సరైనోడు
వన్డేల్లో 43 శతకాలు బాదిన కోహ్లీ అత్యధిక సగటు కలిగిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 230 ఇన్నింగ్స్‌ల్లో 60.31 సగటుతో 11,520 పరుగులు చేశాడు. 50 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసుకున్న ఏ ఆటగాడూ కోహ్లీ దరిదాపుల్లో లేడు. అతడి తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బెవాన్‌ ఉన్నాడు. అతడు 196 ఇన్నింగ్స్‌ల్లో 53.58 సగటుతో 6,912 పరుగులు చేశాడు. 


బెస్ట్‌ కన్‌వర్షన్‌ రేట్‌
‘అర్ధశతకాలను శతకాలుగా ఎలా మార్చాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలి’.. ఇలాంటి వ్యాఖ్యలను ఎందరో మాజీ క్రికెటర్ల నుంచి విన్నాం. దీనికి తగ్గట్టుగానే కోహ్లీ.. వన్డేల్లో ఉత్తమ కన్‌వర్షన్‌ రేటు కలిగిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 76 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 40 సార్లు 50 పరుగులకు పైగా బాదాడు. వీటిలో 19 సార్లు అర్ధశతకాలతో ముగించగా 21 సార్లు శతకాలు సాధించాడు. 52.50 శాతంతో ఉత్తమ కన్‌వర్షన్‌ రేటు కలిగిన కెప్టెన్‌గా నిలిచాడు. 

గెలుపులో నంబర్‌వన్ 
భారత్‌ తరఫున టెస్టుల్లో ఎంతో మంది సారథిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఏ కెప్టెన్‌ సాధించని గెలుపు శాతాన్ని కోహ్లీ సాధించాడు. 56.52 శాతంతో టీమిండియాకు విజయాలు అందించాడు. ఇప్పటివరకు కోహ్లీ 26 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. వీటిలో 10 టెస్టులు విజయం సాధించగా.. 10 డ్రాగా ముగించాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ ఉన్నాడు. టెస్టుల్లో ధోనీ గెలుపు శాతం 45. 

ఒకే మైదానంలో..
సొంత మైదానంలో ఎవరైనా చెలరేగుతారు. కానీ కోహ్లీ ప్రత్యర్థుల మైదానాల్లోనూ రికార్డులు సృష్టిస్తాడు. బంగ్లాదేశ్‌లోని షేర్‌ బంగ్లా నేషనల్‌ స్టేడియంలో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మైదానంలో టీ20ల్లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 10 మ్యాచులు ఆడిన అతడు 472 పరుగులు చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.