
తాజా వార్తలు
ముంబయి: కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణం రద్దు చేసిన తర్వాత పాకిస్థానీ రాజకీయ నాయకులు, క్రీడాకారులు అవాకులు చవాకులు పేలారు. మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అయితే ‘యుద్ధం’ వంటి పదాల్ని తన ప్రసంగాల్లో వాడుతున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. షాహిద్ అఫ్రిది సైతం తన అక్కసును వెళ్లగక్కాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాత్రం కాస్త పరిణతి చూపించాడు. కశ్మీర్లో ఉద్రిక్తత నెలకొలాన్న నేపథ్యంలో ఎవరూ ‘విద్వేషం’ వ్యాప్తి చేయొద్దని కోరాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
‘మన పరిస్థితి బాగాలేదని నేను అంగీకరిస్తాను. మీరు మీ దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం. ఈ రెండూ నేను ఒప్పుకుంటాను. కానీ మరింత విద్వేషం వ్యాప్తి చెందేందుకు మాత్రం మనం కారణం కావొద్దు. ఉద్రికత్త, ఆందోళనను మరింత పెంచే వ్యాఖ్యలు, చర్యల జోలికి పోవొద్దు. మీరు మీ వైఖరి, విశ్వాసాలకే కట్టుబడండి. కానీ పరిస్థితిని మరింత దిగజారకుండా చూడండి’ అని అక్తర్ పేర్కొన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన చిరు
- ‘ఏరా నీకంత పొగరా.. వేషం లేదు పో’ అన్నారు!
- నాటి చేతక్.. నేటి పల్సర్.. ఈయన కృషే..!
- మాజీ ప్రియురాలితో షూటింగ్‌కి నో..
- ఐరాస మెచ్చినఅందాల అమ్మ
- ఏదో ఒక రోజు బాలీవుడ్ సినిమాలో చూస్తారు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
