
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను భయపెట్టే శ్రీలంక పేసర్ శుక్రవారం తన తుది వన్డేను ఆడాడు. 2011లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన మలింగ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 91 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మలింగ (9.4-2-38-3) చక్కని స్పెల్‌తో రాణించాడు. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు. అవి ఏంటంటే..
• వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా, కెన్యా, ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. వీటిలో రెండు హ్యాట్రిక్లను ప్రపంచకప్‌లోనే సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు హ్యాట్రిక్‌లు చేసిన ఆటగాళ్లు మలింగ, వసీమ్ అక్రమ్ మాత్రమే.
• వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్ మలింగ మాత్రమే. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.
• ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు మలింగ. అతను 29 మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టాడు. మెక్‌గ్రాత్ (71), ముత్తయ్య మురళీధరన్ (68) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
• శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ మలింగ (338). అతని కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (523), చమింద వాస్ (399) ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో మలింగ 13 వికెట్లు పడగొట్టి శ్రీలంక తరఫున టాప్ బౌలర్‌గా నిలిచాడు.
• శ్రీలంక తరఫున బౌలింగ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ను కలిగి ఉన్న రెండో బౌలర్ మలింగనే (32.4). అజంతా మెండిస్ తొలి స్థానంలో ఉన్నాడు.
• మలింగ బ్యాట్లోనూ రికార్డు సాధించాడు. శ్రీలంక తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు మలింగనే. పదో స్థానంలో దిగిన అతను అర్ధశతకం బాదడం విశేషం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
