close

తాజా వార్తలు

విండీస్‌ ఎ జట్టును కట్టడి చేసిన నదీమ్‌

విండీస్‌ ఎ పై ఇండియా ఎ ఆధిపత్యం

ఆంటిగ్వా: ఇండియా ఎ X వెస్టిండీస్‌ ఎ జట్ల మధ్య జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత బౌలర్‌ షబ్నాజ్‌ నదీమ్‌ సత్తాచాటాడు. ఐదు వికెట్ల(62/5) ప్రదర్శనతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశాడు. బుధవారం జరిగిన తొలిరోజులో అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ విండీస్‌ జట్టుపై ఇండియా ఎ ఆధిపత్యం చెలాయించింది. తొలుత విండీస్‌ ఎ జట్టు బ్యాటింగ్‌ ఆరంభించగా మహ్మద్‌ సిరాజ్‌ ఓపెనర్లను ఔట్‌చేసి పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత శివందుబే.. ఆ కెప్టెన్‌ షమార్హ్‌ బ్రూక్స్‌ను ఔట్‌చేశాడు.

ఆపై బౌలింగ్‌కు వచ్చిన నదీమ్‌ చెలరేగిపోయాడు. విండీస్‌ ఎ జట్టు మిడిల్‌ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఒక దశలో 97/5తో ఉన్న విండీస్‌ను జర్మైన్‌ బ్లాక్‌వుడ్‌(53), రకీమ్‌ కార్న్‌వాల్‌(59)లు ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 98 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు గౌరప్రదమైన స్కోరు అందించారు. అనంతరం మయాంక్‌ మార్కండే రెండు వికెట్లు తీయడంతో విండీస్‌ ఎ జట్టు 228 పరుగులకు ఆలౌటైంది. 

ఆట పూర్తయ్యేసరికి ఇండియా ఎ వికెట్‌ నష్టానికి 70 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్‌, ప్రియాంక్‌ పాంచల్‌ తొలి వికెట్‌కు 61 పరుగులు చేసి శుభారంభం ఇచ్చారు. ఈశ్వరన్‌(28) పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటవ్వగా ప్రస్తుతం శుభమన్‌గిల్‌, పాంచల్‌ క్రీజులో ఉన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.