
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 20 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన కోహ్లీ.. మరో రికార్డును అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో అర్ధశతకం (66) బాది వరుసగా ఐదు అర్ధ సెంచరీలు చేశాడు. 2015 ప్రపంచకప్‌లో అత్యధికంగా వరుస అర్ధశతకాలు బాదిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు. అంతేగాక వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ (1238) పేరిట ఉన్న రికార్డునూ కూడా కోహ్లీ అధిగమించాడు.
కోహ్లీ గత నాలుగు మ్యాచుల్లో వెస్టిండీస్ (72), అఫ్గానిస్థాన్ (67), పాకిస్థాన్ (77), పాకిస్థాన్‌పై (82) అర్ధశతకాలు సాధించాడు. దీంతో వరుసగా నాలుగు అర్ధశతకాలు బాదిన భారత తొలి కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 1992 ప్రపంచకప్‌లో భారత్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ నాలుగు అర్ధశతకాలు బాదాడు. కానీ వరుస ఇన్నింగ్స్‌ల్లో సాధించలేకపోయాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఆసీస్ సారథి ఫించ్, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ కూడా 50కు పైగా పరుగులు సాధించారు.
మరో రికార్డు చేరువలో: కోహ్లీ మరో 31 పరుగులు సాధిస్తే ప్రపంచకప్‌లో 1000 పరుగులు సాధించిన భారత మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. టీమిండియా తరఫున సచిన్ (2278), గంగూలీ (1006) ప్రపంచకప్‌లో వెయ్యికి పైగా పరుగులు సాధించారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
