close

తాజా వార్తలు

ప్రపంచకప్‌ : టీమిండియా ఉత్తమ, చెత్త రికార్డులివే..

దిల్లీ : క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. గతంలో రెండు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన టీమిండియా.. ఈ సారి కోహ్లీ నేతృత్వంలో మరోసారి మెగా టోర్నీ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. అయితే ప్రపంచకప్‌ యాత్రలో భారత ప్రస్థానం ఎన్నో ఎత్తుపల్లాలతో సాగిందనే చెప్పాలి. మెగా టోర్నీలో టీమిండియా ఉత్తమమైన, చెత్త రికార్డుల్లో కొన్నింటిని ఓసారి పరిశీలిస్తే..
ఉత్తమ గణాంకాలు ఇవే..
1975లో బిషన్‌ సింగ్‌ బేడీ బంతితో మాయాజాలం చేసి ప్రత్యర్థి జట్టు(తూర్పు ఆఫ్రికా)ను ఊపిరి తీసుకోకుండా చేశాడు. 12-8-6-1..ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది బ్యాట్స్‌మెన్‌ను ఏ రకంగా ఊచకోత కోశాడో. 12 ఓవర్లు వేస్తే అందులో 8 మెయిడిన్లే. ఒక్క వికెటే తీసినప్పటికీ.. మొత్తంగా ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడంటే ఎంత పొదుపుగా బౌలింగ్‌ వేశాడో అర్థమవుతుంది.
1983 గ్రూప్‌ దశలో వెస్టిండీస్‌పై దాదాపు ఓటమి ఖాయమైన వేళ.. యశ్‌పాల్‌ శర్మ 89 పరుగులతో రాణించి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పేశాడు.
1983లో ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌..175 పరుగులతో జింబాబ్వేపై రాణించడమే కాకుండా.. ఫైనల్‌లో వివ్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను అద్భుతమైన రీతిలో పట్టి ప్రపంచకప్‌ను భారత్‌కు సాధించి పెట్టాడు
ఇక ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన ఏకైక భారత బౌలర్‌ చేతన్‌ శర్మ. 1987లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన కెన్‌ రూథర్‌ఫర్డ్‌ను, ఇయాన్‌ స్మిత్‌, ఎవెన్‌ ఛాట్‌ఫ్టీల్డ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఇవి మూడు క్లీన్‌బౌల్డ్‌లు కావడం మరో రికార్డు.
2011 ఫైనల్‌లో గౌతం గంభీర్‌ 97 పరుగులు అమూల్యమైనవి. అతని ఇన్నింగ్స్‌ భారత్‌కు రెండోసారి ప్రపంచకప్‌ను తెచ్చిపెట్టింది.
2015లో ధావన్‌ 137 పరుగులతో అద్భుతంగా రాణించడంతో దక్షిణాఫ్రికాపై విజయం సాధ్యమైంది.
ఆరు ప్రపంచకప్‌ల్లో ఆడిన ఘనతను సచిన్‌ దక్కించుకున్నాడు. సచిన్‌తోపాటు ఈ ఘనత అందుకున్నవారిలో జావెద్‌మియాందాద్‌(పాకిస్థాన్‌) ఒక్కడే ఉన్నాడు.

చెత్త రికార్డులు..
* 1975లో సునిల్‌ గావస్కర్‌ 60 ఓవర్ల పాటు క్రీజులో ఉండి చేసిన పరుగులు ఎన్నో తెలుసా.. 36 మాత్రమే. మొత్తం 174 బంతులను ఎదుర్కొన్న సన్నీ అత్యల్ప స్కోరును నమోదు చేసి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.
* 2007లో బంగ్లాదేశ్‌ చేతిలో ఐదు వికెట్ల తేడాతో భారత్‌ ఘోర ఓటమిపాలై ఆ ప్రపంచకప్‌ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించింది.
* ఇక భారత బ్యాటింగ్‌ సరాసరి 1975 నుంచి చూసుకుంటే 32.6 కాగా.. బౌలింగ్‌ సరాసరి 29 మాత్రమే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.