close

తాజా వార్తలు

అక్కడొద్దు.. వెనక్కి వచ్చేయండి: విదేశాంగ శాఖ

ట్రిపోలి: లిబియాలో ఉన్న భారతీయులు వెంటనే వెనక్కి రావాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. లిబియాలో నెలకొన్న ఘర్షణలతో అక్కడ పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్న నేపథ్యంలో భారతీయులకు విదేశాంగ శాఖ ఈ పిలుపు ఇచ్చింది. లిబియా రాజధాని ట్రిపోలిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారని తెలిపింది. ప్రస్తుతమైతే ట్రిపోలి నుంచి విమానాలు తిప్పుతున్నామని.. ఆ తర్వాత అక్కడి నుంచి రప్పించడం కష్టతరమవుతుందని తెలిపింది. లిబియాను తక్షణమే వీడాలని బంధుమిత్రులకు చెప్పాలని విదేశాంగ శాఖ సూచించింది. లిబియాలో నెలకొన్న పరిస్థితులపై యూఎన్‌వో ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు సుమారు 200 మంది  ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో గాయపడినట్టు తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.