close

తాజా వార్తలు

‘భారత్‌ మరో దాడికి సిద్ధమవుతోంది’

 పాక్‌ విదేశీవ్యవహారాల శాఖా మంత్రి ప్రకటన

ఇస్లామాబాద్‌: ఈ నెలలో భారత్‌ తమ భూభాగంపై మరో దాడి చేసేందకు సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయని పాక్‌ విదేశీవ్యవహారాల శాఖా మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ పేర్కొన్నారు. ఆ దాడి ఏప్రిల్‌ 16-20వ తేదీ మధ్యలో జరగవచ్చని పేర్కొన్నారు. 
‘‘భారత్‌ కొత్త దాడికి పథకం రచిస్తోంది. మాకు అందిన సమాచారం మేరకు ఏప్రిల్‌ 16-20 మధ్యలో ఈ దాడి జరగవచ్చు. ఈ విషయాన్ని మాకు నమ్మకమైన ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.’’ అని ఖురేషీ ముల్తాన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ వెల్లడించారు. దీనికి తగిన ఆధారాలు చెప్పేందకు ఆయన నిరాకరించారు. కేవలం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అనుమతితో ఈ విషయాన్ని దేశప్రజలకు వెల్లడించానని తెలిపారు. దీనిపై భారత విదేశాంగశాఖ వెంటనే స్పందించలేదు. భారత్లోని అధికారపార్టీ యుద్ధం కోసం తపిస్తోందని ఆరోపించారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.