close

తాజా వార్తలు

2-3 తేడాతో సిరీస్‌ చేజార్చుకున్న కోహ్లీసేన

భారత్‌పై 35 పరుగుల తేడాతో ఆసీస్‌ విజయం

దిల్లీ: సొంతగడ్డపై సిరీస్‌ ఓటములకు ఆస్ట్రేలియా పగ తీర్చుకుంది. కోహ్లీసేనపై 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. అంతకు ముందు 2-0తో టీ20 సిరీస్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో వన్డేలో కంగారూలు అద్భుత విజయం సాధించారు. భారత్‌ను 35 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించారు. 273 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీసేన 237 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌ శర్మ (56), భువనేశ్వర్‌ కుమార్‌ (46), కేదార్‌ జాదవ్‌ (44) మినహా మరెవ్వరూ రాణించలేదు. అంతకు ముందు ఆసీస్‌లో ఉస్మాన్ ఖవాజా (100) శతకం, పీటర్ హాండ్స్‌కాంబ్‌ (52) అర్ధశతకం సాధించారు.

ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. దిల్లీ కుర్రాళ్లు శిఖర్ ధావన్‌ (12), విరాట్‌ కోహ్లీ (20), రిషభ్‌ పంత్‌ (16) నిరాశపరిచారు. స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆడమ్‌ జంపా (3/46), కమిన్స్‌ (2/38) కీలక ఆటగాళ్లను పెవిలియన్‌ పంపించారు. మరోవైపు వికెట్లు పడుతున్నా రోహిత్‌ శర్మ నిలకడగా ఆడాడు. విజయ్‌ శంకర్‌ (16) సైతం ఉండటంతో విజయంపై ఆశలు పోలేదు. అనవసర షాట్‌కు ప్రయత్నించి అతడు జట్టు స్కోరు 120 వద్ద ఔటయ్యాడు. 132 వద్ద రోహిత్‌, జడేజా వెంటవెంటనే పెవిలియన్‌ చేరిపోయారు. ఈ క్రమంలో కేదార్‌ జాదవ్‌ (44), భువనేశ్వర్‌ కుమార్‌ (46) అద్భుత పోరాటం చేశారు. చివర్లో చేయాల్సిన రన్‌రేట్‌ పెరగడంతో వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో భారత్‌ కథ ముగిసింది. 

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.