close

తాజా వార్తలు

సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ సరసన ధోని

ఇంటర్నెట్‌: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరో రికార్డును సాధించాడు. 2019లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మహి, శనివారం ఉప్పల్‌లో జరిగిన వన్టేలో అర్థశతకం బాది భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో చేసిన పరుగులతో లిస్ట్‌ ఎ- క్రికెట్‌లో 13000 పరుగులు సాధించిన నాలుగో భారత్‌ క్రికెటర్‌గా ధోని రికార్టులుకెక్కాడు.  సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ తరువాత ఈ మైలురాయిని దాటిన భారత క్రికెటర్‌ ధోనీయే.  మిస్టర్‌ కూల్‌  412 లిస్ట్‌ ఎ మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు మొత్తం 13,054 పరుగులు చేశాడు.  ఇంగ్లాండ్‌ క్రికెటర్‌  గ్రాహమ్‌ గూచ్‌ 50.79 సగటుతో 22,211 పరుగులు సాధించి  ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్నాడు.  శనివారం ఆసీస్‌తో జరిగిన మొదటి వన్టేలో కేదార్‌ జాదవ్‌తో కలిసి 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొలిపి భారత్‌కు విజయాన్ని అందిచారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.