close

తాజా వార్తలు

ఆహా కేదార్‌..వాహ్‌వా ధోని!

టీమిండియా విజయంపై ప్రముఖుల ట్వీట్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఉప్పల్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేదార్‌ జాదవ్‌(81 నాటౌట్‌; 87 బంతుల్లో 9×4, 1×6),ధోని (59 నాటౌట్‌; 72 బంతుల్లో 6×4, 1×6)ల బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేయడంతో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టగలిగింది. దీంతో కోహ్లీ సేనను ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

* ‘కేదార్‌ మ్యాచ్‌ను సులభతరం చేశాడు. ప్రపంచకప్‌లో జాదవ్‌ కీలక ఆటగాడు కానున్నాడు. ఉప్పల్‌వంటి పిచ్ పై టీమిండియాకు మంచి విజయం లభించింది. ఘనమైన ముగింపు ఇవ్వడంలో మరోసారి ధోనీ సఫలమయ్యాడు’ -మహమ్మద్‌ కైఫ్‌.

* ‘ఈ మ్యాచ్‌ చూడటానికి ఎంత బాగుందో..ధోనీ భాయ్‌, జాదవ్‌ భయ్యా మీ ఏకాగ్రత అద్భుతం.మన జట్టుకు అభినందనలు’ - హార్దిక్‌ పాండ్య.

* ‘కేదార్‌...నువ్వు టీమిండియాకి దొరికిన అరుదైన ఆస్తివి. కీలక వికెట్‌ పడగొట్టావు. ముఖ్యమైన ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశావు. ఆటను ఘనంగా ముగించావు. నిన్నటి విజయంలో నువ్వు కీలక పాత్ర పోషించిందుకు ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ టీమిండియా’ -ఆకాశ్‌ చోప్రా.

*‘ఇండియా..ఇండియా మీకు సలాం. కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోని క్రీజులో నిలబడి బాగా నిలదొక్కుకున్నాడు. విన్నింగ్‌ షాట్‌ ఆడిన ధోని నిజంగా అద్భుతం’ - వెన్నెల కిశోర్‌.

*‘కేదార్‌ జాదవ్‌-ధోనిల జోడీ అద్భుతం. మీది విన్నింగ్‌ జోడీ’ -గౌరవ్‌ కల్రా.

*‘భారత జట్టుకిది సంతృప్తికరమైన విజయం. టాప్‌ ఆర్డర్‌ అంతగా ఆకట్టుకోక పోయినా జాదవ్‌-ధోని నిలబడి మ్యాచ్‌ను గెలిపించారు’- హర్షా భోగ్లే.

* ‘బౌండరీ బాది ధోనీ జట్టును గెలిపించాడు. హైదరాబాద్‌లో టీమిండియాకు 1-0 ఆధిక్యం లభించింది. కేదార్‌ జాదవ్‌, ధోని ఇద్దరూ కలిసి భారత జట్టుకు శుభారంభం ఇచ్చారు’ - ఐసీసీ.

* ‘రెండు సింహాలు క్రీజులో నిలిచి కంగారూలను నిలువరించాయి. హైదారాబాద్‌ను కేదార్‌ బాద్‌గా జాదవ్‌ మార్చేశాడు. వీకెండ్‌కి టీమిండియా ఘనమైన ముగింపునిచ్చింది. ఆహా కేదార్‌..వాహ్‌వా ధోని. ఈ విజయం మీది’ -చెన్నై సూపర్‌ కింగ్స్‌.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.