close

తాజా వార్తలు

కుమార్తెను కత్తితో పొడిచిన తండ్రి

ప్రేమ వ్యవహారమే కారణం!

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: కుమార్తె ప్రేమను తట్టుకోలేకపోయిన తండ్రి.. ఏకంగా కన్నబిడ్డనే కడతేర్చేందుకు సిద్ధమయ్యాడు. కత్తితో పొడిచి చంపేందుకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన బాలిక ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొటుమిట్టాడుతోంది. ఈ హృదయవిదారక ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడలో చోటుచేసుకుంది. ఉయ్యాలవాడకు చెందిన ఓ బాలిక ప్రేమించిన వ్యక్తితో బయటకు వెళ్లి ఆదివాంం సాయంత్రం ఇంటికి చేరుకుంది. దీంతో ఆగ్రహించిన తండ్రి సదరు బాలికను వెనుక వైపు నుంచి పిడిబాకుతో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాలికను తల్లి ఇతరుల సహాయంతో ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.