
తాజా వార్తలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండల పరిధిలోని అచ్చంపేట కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలికిపురం నుంచి విశాఖ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లా రాజోలు డిపోకు చెందిన బస్సును కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ తిమ్మాపురం-అచ్చంపేట కూడలిలో వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 50 మీటర్ల దూరం ముందుకెళ్లింది. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తిమ్మాపురం ఎస్సై విజయ్‌బాబు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
