
తాజా వార్తలు
ఛండీగఢ్: పంజాబ్‌లో గ్యాంగ్స్టర్లు రెచ్చిపోతున్నారు. నేరాలు చేయడం వాటిని మేమే చేశామంటూ సామాజిక మాధ్యమాల్లో సమర్థించుకుంటూ పేరు సంపాదించుకోవడం అక్కడ సాధారణమైంది. అలాంటి ఘటనే ఒకటి మంగళవారం అమృత్‌సర్‌లో చోటుచేసుంది. ఓ గ్యాంగ్‌స్టర్ పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిని అంతమొందించడమే కాక పేరు కోసం నేనే చేశానంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పండోరి గ్రామానికి చెందిన మణిదీప్‌సింగ్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం స్కూటర్‌పై వెళ్తుండగా హర్విందర్‌సింగ్ అనే గ్యాంగ్‌స్టర్ అతడిని వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక అతడిపై ఎనిమిది సార్లు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. చంపడమే కాకుండా పేరు కోసం హత్య చేసింది తానేనంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
‘పండోరీలో ఆ వ్యక్తిని(మణిదీప్) హత్య చేసింది నేనే. పాత కక్షల కారణంగా మా గౌరవం కోసం అతడిని చంపాం. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే మేము వంద రౌండ్ల కాల్పులు కూడా చేయగలం. ఇందులో పోలీసులు చర్య తీసుకోవాలి కానీ అమాయకులపై కేసు నమోదు చేయకూడదు’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై అమృత్సర్ రూరల్ సీనియర్ ఎస్పీ విక్రమ్‌జిత్ సింగ్ స్పందిస్తూ.. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఫేస్బుక్ కోణంపై కూడా దృష్టి సారించామని తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్‌కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
