close

తాజా వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

రాజమహేంద్రవరం నగరం : విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ సమీపంలోని కొండపల్లికి బొగ్గుతో వెళ్తున్న గూడ్స్‌ రైలు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మెమో కార్‌షెడ్‌ వద్ద పట్టాలు తప్పింది. సోమవారం రాత్రి సుమారు 9.30గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో నాలుగు వ్యాగన్లు పూర్తిగా పట్టాలనుంచి బయటికి వచ్చాయి. దాంతో గోదావరి స్టేషన్‌ మీదుగా రావాల్సిన పలు రైళ్లను రోడ్డు-రైలు వంతెన మీదుగా మళ్లించారు. కాగా విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.