
తాజా వార్తలు
పట్నా: రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారులపై ఓవర్లోడ్ చేసిన ట్రాక్టర్ట్రాలీ పడడంతో ఆరుగురు మృతిచెందిన ఘటన బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గోపాల్గంజ్ జిల్లాలోని సరేయా నరేంద్రలో రోడ్డు పక్కన కొందరు చిన్నారులు ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో వారిపక్క నుంచి భారీలోడుతో వెళుతున్న చిన్నారులపై పడింది. దీంతో చిన్నారుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్కులే. సమాచరం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. పోలీసులు ట్రాలీ కింద నుంచి మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తరువాత సంఘటనా స్థలం నుంచి ట్రాక్టర్ డ్రైవర్ తప్పించుకున్నాడు. ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
