
తాజా వార్తలు
రూ.5 లక్షలు వసూలు చేసిన విలేకరితో పాటు మరొకరిపై కేసు
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఓ టీవీ ఛానల్లో రియాల్టీ షోకు సినీనటి శ్రియను న్యాయనిర్ణేతగా తీసుకొస్తామంటూ రూ.5 లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారని ఓ దిన పత్రిక విలేకరితో పాటు మరొకరిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 5లోని దేవరకొండ బస్తీలో ఉంటున్న చంద్రాయుడు తన దర్శకత్వంలో ఓ ఛానల్లో రియాల్టీ షో నిర్వహించాలనుకున్నారు. దీనికి న్యాయనిర్ణేతగా శ్రియను తీసుకోవాలనుకున్నారు. చంద్రాయుడికి పరిచయమైన ఓ దిన పత్రిక విలేకరి శ్రియ మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీసింధూజ తనకు పరిచయమని నమ్మించాడు. గత నెల 9న ఓ హోటల్లో ఆయనతో లక్ష్మీసింధూజ, విలేకరి మాట్లాడారు. శ్రియను ఒప్పిస్తామని వారు నమ్మించడంతో లక్ష్మీ సింధూజ ఖాతాలో చంద్రాయుడు రూ.5 లక్షలు జమ చేశారు. నెల రోజులు గడిచినా శ్రియ న్యాయనిర్ణేతగా ఖరారు కాకపోవడంతో పాటు సదరు విలేకరి, లక్ష్మీ సింధూజ ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద ఈనెల 10న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రజనీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
- పౌరసత్వ చట్టంతో కాంగ్రెస్‌కు కడుపునొప్పి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
