
తాజా వార్తలు
అల్గునూరు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మృతులను అల్గునూరుకు చిందెం సాయి కిరణ్ (20) రాంనగర్ కు చెందిన దాసరి సాయి కృష్ణ(21)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. లారీని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతికందొచ్చిన పిల్లలు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Tags :