close

తాజా వార్తలు

అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు..

ఆటో బోల్తాపడి బాలిక మృతి
ఇద్దరికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: రెక్కాడితే కానీ డొక్క నిండని నిరు పేదలు వారు.. ఉన్న ఊరిని వదిలి వలస వెళ్లారు. నిత్య రోళ్లు కొడుతూ వచ్చిన సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. వారి సమీప బంధువులైన తల్లీ కూతుళ్లు కంది మండలం చెర్లగూడెంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 12 మంది ట్రాలీ ఆటోలో బయల్దేరారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులోకి రాగానే ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక అక్కడికక్కడే మరణించగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యారు. గ్రామీణ ఎస్సై కె.శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం... కంది మండలం చెర్లగూడెం గ్రామానికి చెందిన ఆలకంట మహేశ్‌, కనకమ్మ, వారి కూతురు దుర్గ (8), పెద్ద ఎల్లయ్య, రాధ, చిన్న ఎల్లయ్య, యాదమ్మ, జెట్టయ్య, రాజు, మరో ఇద్దరు కలిసి కొద్ది రోజుల క్రితం నర్సాపూర్‌కు వలస వెళ్లారు. వారికి బంధువులైన తల్లీకూతుళ్లు గంగమ్మ, నాగమ్మ చెర్లగూడెంలో ఆత్మహత్యకు పాల్పడగా.. ఆదివారం సంఘటన వెలుగుచూసింది. ఈ విషయం తెలియడంతో నర్సాపూర్‌ నుంచి మహేశ్‌ తన ట్రాలీ ఆటోలో 12 మందిని ఎక్కించుకొని చెర్లగూడెంకు బయల్దేరారు. ఈ క్రమంలో ఇస్మాయిల్‌ఖాన్‌పేట శివారులో ట్రాలీ ఆటో బోల్తాపడింది. తీవ్ర గాయాలతో దుర్గ అక్కడికక్కడే మరణించగా.. ఆమె తల్లి కనకమ్మ, మరో మహిళ రాధమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్సకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారంతా క్షేమంగా బయట పడ్డారు. దుర్గ అంత్యక్రియలు చర్లగూడెంలో నిర్వహించారు. అయ్యో తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ దుర్గ తండ్రి మహేశ్‌ రోదనలు మిన్నంటాయి. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.