close

తాజా వార్తలు

నర్సంపేటలో ఆర్మీ జవాన్‌ హత్య

నర్సంపేట:  పుట్టిన రోజు వేడుకల్లో చెలరేగిన వివాదంలో ఓ ఆర్మీ జవాన్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్‌లో ప్రేమ్‌కుమార్‌ అనే ఆర్మీ జవాన్‌ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరిగాయి.ఈ వేడుకల్లో భాగంగా యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ వివాదాన్ని రాజీ చేసేందుకు ప్రేమ్‌కుమార్‌ యత్నించగా.. దూదిమెట్ల దిలీప్‌ కుమార్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.