close

తాజా వార్తలు

మంత్రి కేటీఆర్‌ పీఏనంటూ మోసాలు

నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యక్తిగత సహాయకుడినంటూ ఓ వ్యక్తి పలువురికి ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ వ్యక్తి తెరాస నాయకులు, కార్యకర్తలు, అధికారులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. మంత్రి ఇంటికి కొన్ని వస్తువులు పంపించాలని.. వాటిని నేరుగా కాకుండా ఓ చోట ఉంచితే తాను కారు తీసుకుని వస్తానంటూ చెబుతున్నాడు. ‘పీఏ వస్తున్నారంటూ ఫలానా వారికి చెప్పండి.. అక్కడికి వెళ్లి మేం షాపింగ్‌ చేస్తాం’ అని కొందరితో మాట్లాడాడు. బంజారాహిల్స్‌లో ఉంటున్న ఓ నేతకు సదరు నిందితుడు మూడు రోజుల క్రితం ఫోన్‌ చేసి ఓ పనిచేయాలంటూ అభ్యర్థించగా.. ఆయనకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆ వ్యక్తి అసలు కేటీఆర్‌ పీఏనే కాదని తేల్చారు. వెంటనే ఆ నేత హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.