Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144532
            [news_title_telugu_html] => 

మహిళను కింద పడేసి మరీ ఈడ్చుకెళ్లాడు

[news_title_telugu] => మహిళను కింద పడేసి మరీ ఈడ్చుకెళ్లాడు [news_title_english] => Chhattisgarh Officials Husband Caught On Camera Dragging A Woman [news_short_description] => ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న మూడు నెలల పసిబిడ్డ తల్లిని ఓ వ్యక్తి దారుణంగా ఈడ్చుకెళ్లి బయటపడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లా జనక్‌పూర్‌ బ్లాక్‌లో చోటుచేసుకుంది. [news_tags_keywords] => women,hostel superintendent,drag women out [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1163288123192815623 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:36:57 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మహిళను కింద పడేసి మరీ ఈడ్చుకెళ్లాడు - Chhattisgarh Officials Husband Caught On Camera Dragging A Woman - EENADU
close

తాజా వార్తలు

మహిళను కింద పడేసి మరీ ఈడ్చుకెళ్లాడు

రాయ్‌పూర్: ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న మూడు నెలల పసిబిడ్డ తల్లిని ఓ వ్యక్తి దారుణంగా ఈడ్చుకెళ్లి బయటపడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా జనక్‌పూర్‌ బ్లాక్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమీలా సింగ్‌ అనే మహిళ జనక్‌పూర్‌బ్లాక్‌లోని బర్వాని కన్యా ఆశ్రమానికి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇదే వసతిగృహంలో ఆయాగా పనిచేస్తున్న ఒక మహిళ తన మూడు నెలల పసిబిడ్డతో కలిసి అక్కడే ఆశ్రయం ఉంటోంది. ఈ క్రమంలో సూపరింటెండెండ్‌ సుమీలా సింగ్‌ భర్త రంగ్‌లాల్‌ సింగ్‌ వసతి గృహానికి వెళ్లి ఆయాతో వాగ్వాదానికి దిగాడు. ఆమెను వసతిగృహంలో ఎందుకు ఉంటున్నావని నిలదీశాడు. మహిళ అని కూడా చూడకుండా రంగ్‌లాల్‌ ఆమెను దూషిస్తూ, మంచం మీద నుంచి కింద పడేసి దారుణంగా ఈడ్చుకెళ్లాడు. ఇంత జరుగుతున్నా వసతిగృహ సూపరింటెండెంట్‌ పక్కనే ఉండి కూడా భర్తను వారించలేదు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు భార్యభర్తలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈక్రమంలో ఆదివారం బాధితురాలిని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకులు పరామర్శించి ఘటనపై ఆరా తీశారు. 

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.