close

తాజా వార్తలు

12 ఏళ్ల బుల్లోడు...రోబో చేశాడు

మలక్‌పేటకు చెందిన బాలుడి ప్రతిభ
ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పాఠాల బోధనతో గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్‌

12 ఏళ్ల బాలుడు... ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లి చదువుకుంటూనే తనలో నిబిడీకృతమైన ప్రతిభకు పదును పెట్టాడు. అతి చిన్న వయసులోనే రోబో తయారు చేసి అబ్బుర పరుస్తున్నాడు. ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన సర్వింగ్‌(పనులు చేసే) రోబో మనిషి ఆదేశాలు పాటిస్తూ చక్కగా పనులు చేస్తోంది. ఇంతకీ ఈ రోబో చేసిన బాలుడు ఎవరో తెలుసా? కొన్ని నెలల కిందట ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుర్తింపు సాధించిన ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన మహమ్మద్‌ హస్సాన్‌ అలీ. తాజాగా అతను తయారు చేసిన రోబో విశేషంగా ఆకట్టుకుంటోంది.

హమ్మద్‌ హస్సాన్‌ అలీ ప్రస్తుతం ఆస్మాన్‌ఘర్‌లోని ఇంటగ్రల్‌ ఫౌండేషన్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లిదండ్రులు షౌకత్‌బుతూల్‌, మహమ్మద్‌ సాదక్‌ అలీ. తండ్రి సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పటికే బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ పాఠశాలు బోధిస్తూ హస్సాన్‌ అలీ మంచి గుర్తింపు సాధించాడు. స్థానిక విద్యార్థులతోపాటు వివిధ దేశాలకు చెందిన వారు... ఈ బాలుడి దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, రోబోటిక్స్‌లో హస్సాన్‌ అలీ పట్టు సాధించాడు. ఇందులో భాగంగా  పనులు చేసిపెట్టే రోబోను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. రూ.40 వేలు వెచ్చించి రోబోకు అవసరమైన పరికరాలు సమకూర్చుకున్నాడు. ఇందుకోసం ఎక్కడికో వెళ్లకుండా కోఠిలోని గుజరాతీ గల్లీలో లభించే సామగ్రి కొనుగోలు చేశాడు. రిసీవర్‌, ట్రాన్స్‌మీటర్‌, ఆర్డ్యూనోయునో, వాయిస్‌ ప్లే బ్యాక్‌ మాడ్యూల్‌, స్పీకర్‌, అల్ట్రాసోనిక్‌ సెన్సర్‌, రెండు మోటార్లు, రెండు చక్రాలు వినియోగించాడు. ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకుంటూ 15 రోజుల్లో రూపొందించాడు.

ఇవీ ప్రత్యేకతలు
ఈ రోబోకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సర్వింగ్‌ రోబో(పనులు చేసేందుకు) వీలుగా దీన్ని అలీ తయారు చేశాడు. ఇది ఆటోమేటిక్‌తోపాటు మొబైల్‌, వాయిస్‌ కంట్రోలర్‌, లైన్‌ ఫాలోయింగ్‌ విధానంలో పని చేస్తుంది. ఇందులో అమర్చిన మైక్రో కంట్రోలర్‌తో నియంత్రించేందుకు వీలుంటుంది. మనకు అవసరమైన వస్తువులు తీసుకురావడంతో ప్రత్యేక సందర్భాల్లో శుభాభినందనలు తెలుపుతుంది. లైన్‌ ఫాలోయింగ్‌ విధానం కారణంగా హోటళ్లలో ఒక టేబుల్‌ నుంచి మరొక టేబుల్‌కు వెళుతూ ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు ఎంతో ఉపయోగ పడుతుందని అలీ తెలిపాడు.

విద్యార్థులు, కళాశాలలకు ఉచిత ప్రదర్శనలు
ఇప్పటికే ఐఐఐటీ భాగస్వామ్యంలో ఓ ప్రాజెక్టును రూపొందించే పనిలో అలీ నిమగ్నమయ్యాడు. ఎంబెడ్డెడ్‌ సిస్టమ్స్‌లో దాదాపు 100కుపైగా ప్రాజెక్టులు తయారు చేశాడు. వీటికి సంబంధించి తెలంగాణలోని పలు కళాశాలల్లో ఉచిత ప్రదర్శనలు ఇస్తున్నాడు. కృత్రిమ మేధకు సంబంధించిన విశేషాలను తెలుసుకోవాలనుకునే విద్యార్థులకు ఉచితంగా నేర్పిస్తున్నాడు. ఆసక్తి గల వారు www.skillindia.lce.com ‌లో సంప్రదించవచ్చన్నాడు. అలీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పాఠశాలకు వెళతాడు. అక్కడి నుంచి వచ్చాక కాసేపు చదువుకుని సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతుంటాడు. ఇప్పటి వరకు వివిధ కళాశాలలు, వేదికలపై వివిధ అంశాల్లో 2,700 ప్రదర్శనలు ఇచ్చినట్లు బాలుడి తండ్రి సాదక్‌ అలీ వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.