close

తాజా వార్తలు

కన్నకూతురిపై అత్యాచారం!

కావలి : సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కావలిలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్‌ ఘటన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ కథనం మేరకు.. జలదంకి మండలానికి చెందిన ఓ బాలికపై కన్న తండ్రి మే, జూన్‌ నెలల్లో అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. బాలిక గర్భం దాల్చడంతో తల్లికి అనుమానం వచ్చి నిలదీయగా.. తండ్రి చేసిన దారుణాన్ని ఆ బాలిక వివరించింది. దాంతో కావలిలోని ఓ వైద్యశాలకు బాలికను తీసుకొచ్చి అబార్షన్‌ చేయించేందుకు వైద్యులను సంప్రదించగా.. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. తండ్రి పరారయ్యేందుకు చెన్నైకు వెళ్లే క్రమంలో ముసునూరు వద్ద ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాను అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.